19-07-2024 03:40:56 PM
హనుమకొండ: పనిచేస్తున్న షాపులోనే చోరీ చేసిన ఘరానా దొంగను పోలీసులు అరెస్టు చేశారు. బంగారం కరిగించే షాపులో ఓ వ్యక్తి నమ్మకంగా పనిచేస్తూ అదే ముసుగులో అదును చూసి భారీ మొత్తంలో బంగారాన్ని చోరీ చేశాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు సిసిఎస్, మట్వాడా పోలీసులు సంయుక్తంగా షాపును తనిఖీ చేసి ఘరానా దొంగను అరెస్టు చేశారు. పోలీసులకు పట్టుబడిన దొంగ నుండి సుమారు 52 లక్షల విలువ గల 700 గ్రాముల బంగారు బిస్కెట్లతో పాటు ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.