19-07-2024 04:02:41 PM
బెల్లంపల్లి (విజయ క్రాంతి): మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి నియోజకవర్గంలో గురువారం అర్ధరాత్రి నుండి శుక్రవారం వరకు కురుస్తున్న భారీ వర్షానికి భీమిలి మండలంలోని ఖర్జీ భీంపూర్ గ్రామంలో బీటి రోడ్డు రెండు వైపులా తెగిపోయింది. దీంతో ఖర్జి భీం పూర్ నుండి మండల కేంద్రానికి రాకపోకలు నిలిచిపోయాయి. భీమిని, కన్నేపల్లి మండలాల్లో ఎర్రవాగు ఉధృతంగా ప్రవహించింది. చిన్న తిమ్మాపూర్ వాగు ఉప్పొంగడంతో భీమిని, దహేగాం మండలాల్లోని పలు గ్రామాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షం దాటికి పత్తి పంట నీటి మునిగిపోయింది. భీమిని, కన్నేపల్లి, వేమనపల్లి మండలాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడింది