18 July, 2026 | 3:36 PM

గోల్డెన్ చాయ్.. క్యా టేస్ట్ హై భాయ్

16-12-2024 01:44 AM

టీ ఖరీదు అక్షరాలా లక్ష

దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో స్పెషల్ ఇది..

అబుదాబీ, డిసెంబర్ 15: దుబాయ్‌లోని ఓ రెస్టారెంట్‌లో టీ ధర 500 దిరమ్స్. భారత్ కరెన్సీలో అక్షరాలా రూ.లక్షకు పైగా అన్నమాట. భారత సంతతికి చెందిన సుచేతశర్మ నడుపుతున్న ‘బోహూ’ రెస్టారెంట్‌లో ‘గోల్డ్ కరక్ టీ’ స్పెషల్. యాజమాన్యం బంగారు రంగుతో మెరిసే టీని వెండి కప్పుల్లో సర్వ్ చేస్తుంది. సంపన్నులైన టీ ప్రియులు రెస్టారెంట్‌కు వచ్చి లొట్టలేసుకుంటూ ఈ టీ తాగుతారు. కొసమెరుపేంటంటే.. టీ తాగిన తర్వాత ఆ వెండి కప్పును కస్టమర్లు ఇంటికి తీసుకెళ్లొచ్చు.

అలాగే రెస్టారెంట్ ‘రాయల్ మెనూ’లో గోల్డ్ సావనీర్ కాఫీ, గోల్డ్ డస్టెడ్ క్రోసెంట్స్, గోల్డ్ డ్రింక్స్, గోల్డ్ ఐస్‌క్రీం సైతం ఫేమస్. వీటి ధరలు కూడా ఇంచుమించు టీ ధరకు అటు ఇటుగా ఉంటాయి.