22-05-2025 12:00:00 AM
చినజీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో.. కిటకిటలాడిన ఆలయం
సిద్దిపేట, మే 21 (విజయక్రాంతి): సిద్దిపేట వెంకటేశ్వర స్వామి దేవాలయ స్వర్నోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మో త్సవ మహా కుంబాభీషేకం కార్యక్రమంలో చిన్న జీయర్ స్వామి వారితో కలసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. వెంకటేశ్వర స్వామి దేవాలయ అర్ధ శతబ్దపు స్వర్నోత్సవలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.
చిన్నజీయర్ స్వామి మూడు రోజుల సమయం ఇవ్వడం సిద్దిపేట ప్రజల అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ఈ ఆలయాన్ని 1975లో పెద్ద జీయర్ పర్యవేక్షణ లో ప్రతిష్ట చేశారని, 1991లో రాజగోపురం చిన్న జీయర్ స్వామి పర్యవేక్షణలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్వర్నోత్సవాలు కూడా చిన్న జీయర్ స్వామి వారి పర్యవేక్షణలో జరగడం సిద్దిపేట ప్రజల అదృష్టమన్నారు.
ఒక ఆలయాన్ని ప్రారంభించి నిరాటంకంగా 50 సంవత్సరాల పాటు నిత్య పూజలు చేయడం ఆషామాషీ విషయం కాదన్నారు. అన్నదాన సత్రానికి అవసరమైన 5000 %ఐవితీశిరీ% గ్రానైట్ ని 15రోజుల్లో ఏర్పాటు చేస్తానని హామీచారు.
ఇక్కడ మొక్కుబడి పూజలు ఉండవు, ఏ కార్యక్రమాన్ని నిర్వహించినా అత్యంత ప్రతిష్టాత్మకంగానే నిర్వహిస్తారని తెలిపారు. సిద్దిపేట జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో వెంకటేశ్వర ఆలయం భక్తులతో కిటకిటలాడింది.