21-05-2025 10:45:57 PM
మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు..
మహబూబాబాద్ (విజయక్రాంతి): భారతదేశం ప్రపంచంలో అగ్రగామిగా ఈరోజు నిలవడానికి ఆనాడు స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీ అమలు చేసిన శాస్త్ర సాంకేతిక రంగాలే కారణమని కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు(Mandal Congress Party President Allam Nageswara Rao) అన్నారు. కేసముద్రం మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ, మాజీ ప్రధాని భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ సెంటర్లో రాజీవ్ గాంధీ చిత్రపటానికి కేసముద్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అల్లం నాగేశ్వర్ రావు, ట్రాన్స్పోర్ట్ అథారిటీ మెంబర్ రావుల మురళి, డిసిసి ఉపాధ్యక్షుడు అంబటి మహేందర్ రెడ్డి, పిఎస్సిఎస్ మాజీ చైర్మన్ బండారు వెంకన్న, సీనియర్ నాయకులు బండారు దయాకర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాగేశ్వర్ రావు మాట్లాడుతూ... స్వతంత్ర భారత యువ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించి యువత రాజకీయాల్లోకి వచ్చేలా స్ఫూర్తి నింపిన నేత రాజీవ్ గాంధీ అన్నారు. 18 సంవత్సరాల వారికి ఓటు హక్కు కల్పించడం, నవోదయ విద్యాలయాలు లాంటి అనేక పథకాలు ఆయన హయంలో వచ్చాయని గుర్తుచేశారు. టెలికాం, ఐటీకమ్యూనికేషన్ రంగాలలో భారత్ అభివృద్ధి కి ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు. దేశానికి సాంకేతికతను తీసుకొని వచ్చి ప్రపంచంలో టెక్నాలజీ విప్లవంలో భారత్ ను ముందంజలో నిలిపింది రాజీవ్ గాంధీయే అన్నారు. దేశం కోసం తన ప్రాణాలను అర్పించి దేశ ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడు రాజీవ్ గాంధీ అన్నారు.
అభివృద్ధి చెందుతున్న దేశాల సరసన భారతదేశన్ని నిలిపిన ఘనత ఆయనదేనని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముదిగిరి సాంబయ్య, మార్కెట్ డైరెక్టర్ ఎండీ ఆయుబ్ ఖాన్, బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శి పోలేపాక నాగరాజు, మాజీ ఉప సర్పంచ్ బానోత్ వెంకన్న, దామరకొండ ప్రవీణ్ కుమార్, పోకల శ్రీనివాస్,గ్రామ కమిటీ అధ్యక్షులు వెంకట్ రెడ్డి, ప్రతాప చారి, గండి శ్రీనివాస్ గౌడ్, రాజులపాటి మల్లయ్య, సట్ల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలు, గోపాల్ రెడ్డి, ముల భూలోక్ రెడ్డి, కళ్ళెం శ్రీనివాస్ రెడ్డి, తరాల సుధాకర్, రషీద్ ఖాన్, బన్నిశెటి వెంకటేష్, ఎలేందర్, ఆగే చిన్న వెంకన్న, పరకాల కుమార్, చిన్న సాంబయ్య, బోడా విక్కి, బదావత్ శంకర్, ఎండీ అలీమ్, ఉప్పునూతల శ్రీను, కనుకుల రాంబాబు, సామల నరసయ్య, భూక్యా అరుణ్, హనుమ, సుందర్ వెంకన్న, బధ్య, మామిడిశెట్టి మల్లయ్య, నరసింహ రెడ్డి, రామ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.