calender_icon.png 22 May, 2025 | 6:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మట్టి తవ్వకాలపై చర్యలు

21-05-2025 10:48:34 PM

పటాన్ చెరు: గడ్డపోతారం మున్సిపల్ పరిధిలో అర్దరాత్రి చేపట్టిన అక్రమ మట్టి తవ్వకాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 79లో మంగళవారం అర్దరాత్రి జేసీబీలతో అక్రమంగా మట్టిని తవ్వి టిప్పర్ లలో తరలిస్తున్నట్లు రెవెన్యూ అధికారులు సమాచారం ఇవ్వడంతో పోలీస్ సిబ్బందితో కలిసి ప్రభుత్వ భూమిలో మట్టి తవ్వకాలు చేపట్టిన స్థలం వద్దకు వెళ్లి రెండు జేసీబీలు, రెండు టిప్పర్ లను స్వాదీనం చేసుకున్నట్లు బొల్లారం సీఐ రవీందర్ రెడ్డి(CI Ravinder Reddy) బుధవారం తెలిపారు. జేసీబీ, టిప్పర్ యజమానులు, డ్రైవర్ లపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.