calender_icon.png 6 July, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టాటా సోల్‌ఫుల్‌కు గోల్డెన్ స్ఫూన్ అవార్డు

12-12-2024 01:06:45 AM

* రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌తో భాగస్వామ్యానికి గుర్తింపు

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): మిల్లెట్ ఆధారిత ఆరోగ్యకరమైన స్నాక్స్, బ్రేక్‌ఫాస్ట్ విభాగంలో ‘టాటా సోల్‌ఫుల్ ’కు ప్రఖ్యాత కోకోకోల గోల్డెన్ స్ఫూన్ 2024 అవార్డు దక్కింది. రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌తో టాటా సోల్‌ఫుల్ భాగస్వామ్యానికి ఈ గుర్తింపు లభించింది. ఈ సందర్భంగా టాటా సోల్‌ఫుల్ అధ్యక్షుడు ప్రశాంత్ పరమేశ్వరన్ హర్షం వ్యక్తంచేశారు. రిలయన్స్ స్మార్ట్ పాయింట్‌తో తమ భాగస్వామ్యానికి గోల్డెన్ స్పూన్ అవార్డు పొందడం గౌరవంగా ఉందని చెప్పారు. దేశ్ కే మిల్లెట్స్ ప్రతిపాదన ద్వారా మిల్లెట్లను ప్రతీ ఇంటికి చేర్చడం పట్ల తమ కర్తవ్యాన్ని మరోసారి ధ్రువీకరించిందన్నారు. 2013 నుంచి తమ సంస్థ పిల్లలు, పెద్దల కోసం సమకాలీన రుచి, ఫర్మాట్లలో మిలెట్ ఉత్పత్తులను అందిస్తోందని తెలిపారు.