calender_icon.png 7 July, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెట్టుబడిదారులను పెంచి పోషిస్తున్న బిజెపి ప్రభుత్వం

06-07-2025 03:03:39 PM

వలిగొండ,(విజయక్రాంతి): మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి మోడీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ వారి ప్రయోజనాల కోసం కార్మిక చట్టాలను సవరిస్తూ నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చిందని సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి తుర్కపల్లి సురేందర్ ప్రభుత్వాన్ని విమర్శించారు. ఆదివారం వలిగొండ మండల కేంద్రంలో జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ... కార్మికులు పోరాటాలు చేసి సాధించుకున్న హక్కులను, చట్టాలను మారుస్తూ పెట్టుబడిదారులకు ఉపయోగపడే లేబర్ కోడ్ లు తీసుకువచ్చిందని, ఈ లేబర్ కోడ్ ల వల్ల కార్మికులకు సాధించుకున్న హక్కులను పూర్తిగా కోల్పోతున్నారని అన్నారు. ఈ లేబర్ కోడ్ ల వల్ల కార్మికుల పనిగంటల విధానం పెరిగి, పని పెరిగి  శ్రమ దోపిడీ కి గురవుతారని, ఆవేదన వ్యక్తం చేశారు.