calender_icon.png 7 July, 2025 | 6:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవంగా ముత్యాలమ్మ విగ్రహ పునఃప్రతిష్ఠాపన

12-12-2024 01:06:34 AM

ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు కొండా, పొన్నం, ఎంపీ ఈటల

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 11 (విజయక్రాంతి): సికింద్రాబాద్ కుమ్మరివాడలో ముత్యాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని బుధవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేషన్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు.

మంత్రలు కొండా, పొన్నం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి కొండా మాట్లాడుతూ.. ధ్వంసమైన ముత్యాలమ్మ విగ్రహ స్థానంలో 250 కిలోల పంచలోహాలతో నూతన విగ్రహాన్ని ప్రతిష్టించిన ట్టు తెలిపారు.  దేవాదాయ శాఖ కమిషనర్ శైలజారామయ్యర్, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, అసిస్టెంట్ కమిషనర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.