calender_icon.png 31 January, 2026 | 4:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరగాలి

31-01-2026 02:31:44 PM

తెలంగాణపై మోదీకి చిన్నచూపు

హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు న్యాయం జరగాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) గాంధీభవన్ లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. బడ్జెట్ లో తెలంగాణకు నిధులు వచ్చేలా రాష్ట్ర బీజేపీ ఎంపీలు కృషి చేయాలని మంత్రి పొన్నం కోరారు. బడ్జెట్ లో తెలంగాణకు ఏం కావాలో ఎప్పటి నుంచో అడుగుతున్నామని పేర్కొన్నారు. తెలంగాణపై ప్రధాని నరేంద్ర మోదీకి(Prime Minister Narendra Modi) చిన్నచూపు.. తెలంగాణ పుట్టుకనే ప్రధాని అవమానించారని పొన్నం తెలిపారు. ఆర్ఆర్ఆర్, మెట్రోకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని కోరారు.

కేంద్రం నుంచి ఏమీ అడగబోమని గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Government) అహంకారంగా మాట్లాడిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంతో సయోధ్య కోరుకుంటుందని తెలిపారు. బడ్జెట్ లో మా ప్రతిపాదనలను కేంద్రం అంగీకరించాల్సిందేనని పొన్నం పేర్కొన్నారు. తెలంగాణ ఎంపీలు రాష్ట్రం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. భారత్ ఫ్యూచర్ సిటీకి(India Future City) కేంద్రం సహకరించాలని పేర్కొన్నారు. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదించాలని పొన్నం ప్రభాకర్ కోరారు.