సమ్మెకు శుభంకార్డు
ప్రభుత్వానికి ధన్యవాదాలు: దిల్ రాజు
నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు మాట్లాడుతూ.. “18 రోజులుగా షూటింగులు ఆగిపో యాయి. సమస్యను పరిష్కరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులకు, ఎఫ్‌డీసీకి, కార్మికశాఖకు సూచించారు. అటు నిర్మాతల ఇబ్బం దును ఫెడరేషన్ వాళ్లు, ఫెడరేషన్ సమస్యలను నిర్మాతలు అర్థం చేసుకున్నారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్న సీఎంకు, ఆఫీసర్లకు, ఫిల్మ్ ఛాంబర్‌కు కృతజ్ఞతలు” అన్నారు.
సినీకార్మికుల సమ్మెకు శుభం కార్డు పడింది. ప్రభుత్వ జ్యోకంతో ఎట్టకేలకు చిత్రపరిశ్రమలో నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. 18 రోజులుగా స్తంభించిన షూటింగులు తిరిగి శుక్రవా రం నుంచి ప్రారంభం కానున్నాయి. 30 శాతం వేతనాలు పెంచాలంటూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆగస్టు 4న సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో పక్షం రోజులకు పైగా షూటింగులు నిలిచిపోవడాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
ప్రభుత్వ ఆదేశాలతో ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజు, కార్మికశాఖ అదనపు సం చాలకుడు గంగాధర్ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ఇరువర్గాలతో అసిస్టెంట్ కమిషనర్ గంగాధర్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గురువారం చర్చలు జరిపారు. మధ్యా హ్నం నుంచి రాత్రి 9 గంటల వరకు సుదీర్ఘంగా చర్చలు జరిగాయి. కార్మికులకు 22.5 శాతం వేతన పెంపునకు అంగీకారం కుదిరింది. చర్చల వివరాలను మీడియాకు వివరించారు.
అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. “ఫెడరేషన్, ఛాంబర్ మధ్య చర్చలు ఫలించకపోవటంతో మా వద్దకు వచ్చారు. ఈరోజు ఒప్పందం కుదిరింది. 22.5 శాతం వేతన పెంపునకు అంగీకరించారు. రూ.2 వేల లోపు వేతనాలు ఉన్నవారికి తొలి ఏడాది 15 శాతం, రెండో ఏడాది 2.5 శాతం, మూడో ఏడాది 5 శాతం పెంచనున్నారు.
రూ.2 వేల నుంచి రూ.5 వేల మధ్య ఉన్నవారికి తొలి ఏడాది 7.5 శాతం, రెండో ఏడాది 5 శాతం, మూడో ఏడాది 5 శాతం వేతనం పెంచనున్నారు” అని వివరించారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. “శుక్రవారం నుంచి సినీకార్మికులు షూటింగులకు హాజరవుతారు. పర్సంటేజీ విషయంలో బాధగా ఉన్నా సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం తప్పట్లేదు” అన్నారు.
ఫెడరేషన్‌కు లేబర్ కమిషన్ నోటీసులు
మరోవైపు ఫెడరేషన్‌కు లేబర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. మెంబర్‌షిప్ ఫీజులు, చందాల లెక్కలు, బ్యాంక్ బ్యాలెన్సులు, ఆడిట్ రిపోర్టులు, మినిట్స్ బుక్ సమర్పించాలని ఆదేశించింది. మూడు రోజుల్లో అన్ని వివరాలతో హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది.






