11 May, 2026 | 9:17 AM

Good News: జియో కస్టమర్లకు ఆఫర్లు

29-08-2024 03:46 PM

తన యూజర్లకు జియో  గుడ్‌న్యూస్‌ చెప్పింది. ముఖేష్‌ అంబానీ జియో కస్టమర్లకు ఆఫర్లు ప్రకటించారు. 100 జీబీ ఫ్రీ క్లౌడ్‌ స్టోరేజీని ఉచితంగా ఇవ్వనున్నట్లు జియో వెల్లడించింది. హలో జియో పేరుతో సెటప్‌ బాక్స్‌ కోసం ఓఎస్ టీవీ అందుబాటులోకి  తీసుకొచ్చింది. జియో ఫైబర్‌ రిమోట్‌లో ఇకపై ఏఐ బటన్‌తో కొత్త ఫీచర్‌ వచ్చింది. రిలయన్స్‌ షేర్స్‌ ఉన్నవాళ్లకు 1:1 పద్ధతిలో బోనస్‌ షేర్లు, ముఖేష్‌ వారసులకు కంపెనీ బాధ్యతలు అప్పగించారు. ఈషాకు రిటైల్‌, ఆకాశ్‌కి జియో, అనంత్‌కు న్యూ ఎనర్జీ బిజినెస్‌లు అప్పగించారు. ఛైర్మన్‌గా  ముఖేష్‌ మరో ఐదేళ్లపాటు కొనసాగనున్నట్లు ప్రకటించారు.