"బోల్ట్"..కా దో 'బచ్చా'.. స్ప్రింటింగ్ మే బహుత్.. అచ్చా!
జమైకా: పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్.... తన పుత్ర రత్నాల పుత్రోత్సాహంతో తెగ మురిసి పోతున్నాడని క్రీడా పండితులు వర్ణిస్తు న్నారు. చిరుతతో పోటీ పడే పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్.. 100మీ. 200మీ. పరుగులో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు. బోల్ట్ అభిమానులను అలరించడానికి..100మీ.(9.58సె), 200మీ.(19.19సె.)లో ప్రపంచ రికార్డులు స్థాపించిన బోల్ట్ 2017 వరల్డ్ అథ్లెటిక్ చాంపియన్ షిప్స్ తరువాత పరుగుకు వీడ్కోలు పలికారు. తదనంతరం రన్నింగ్ ట్రాక్ బొత్తిగా బోసి పోయింది. తాజాగా బోల్ట్ వారసులు అథ్లె టెక్స్ లో అరంగేట్రం చేసి సందడి చేస్తున్నారు. బోల్ట్ పుత్రరత్నాలు ఇద్దరూ పరుగో పరుగు అంటూ ట్రాక్ అండ్ ఫీల్డ్ లో మెరుపు తీగల్లా దూసుకు పోతున్నారు. 14 ఏళ్ల బ్రిటిష్ అథ్లెట్ డివైన్ ఐ హెం ప్రపంచంలో అత్యంత వేగవంతమైన అండర్14 పరుగుల వీరుడిగా నిలిచాడు. మరొకరు 16 ఏళ్ల ఆస్ట్రేలియన్ స్ప్రింటర్ గౌట్ గౌట్ తాజాగా లీ వ్యాలీ అథ్లెటిక్స్ కేంద్రంలో 100మీ. రేసులో గౌట్ 10.30 టైమింగ్ తో రికార్డు స్థాపించాడు. ఇదే రువ్వడితో తమ పెర్ఫార్మెన్స్ సాగిస్తే 2028 ఒలింపిక్స్ లో బోల్ట్ పుత్రరత్నాలు మెరుపు తీగల్లా దూసుకుపోతారని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు.






