calender_icon.png 21 July, 2025 | 4:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ కు గోపాల్ యాదవ్ రాజీనామా

21-07-2025 11:43:03 AM

-మొదట హస్తం పెట్టిన పార్టీలోకి చేరే అవకాశం ఉందంటూ ప్రచారం 

మహబూబ్ నగర్, (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కీలక నేతల్లో ఒకరైన గోపాల్ యాదవ్(Gopal Yadav Resigns) బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.  గత ప్రభుత్వ హయాంలో రైతుబంధు కమిటీ జిల్లా అధ్యక్షులుగా కీలక బాధ్యతలు నిర్వహించారు. గోపాల్ యాదవ్ రాజకీయ రంగ ప్రవేశం కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరంభమైంది. 1975లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, 1982లో టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులుగా, 1987లో మున్సిపల్ కౌన్సిలర్ గా మొదటిసారి గెలిచారు.  1988లో జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా, 1992లో జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా, 1995 ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులుగా, 2001లో ఆప్కో డైరెక్టర్ గా, జిల్లా కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వహించారు.

ఈ తరుణంలో తిరిగి టిఆర్ఎస్ కు అనుబంధంగా ఉంటూ వస్తున్న వచ్చారు. 2005లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ నుంచి ఏకైక కౌన్సిలర్ గా గెలుపొందారు. 2009లో తిరిగి కాంగ్రెస్ పార్టీకి చేరుకున్నారు. 2014లో గోపాల్ యాదవ్ సతీమణి పద్మజా కౌన్సిలర్ గా గెలుపొందారు. 2014 మున్సిపల్ చైర్ పర్సన్ ఎంపికలో  రాధా అమర్ రెండున్నర సంవత్సరాలు, పద్మజ రెండున్నర సంవత్సరాలు అంటూ ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి మున్సిపల్ చైర్మన్ గా ముందుగా రాధా అమర్ బాధ్యతలు నిర్వహించారు. దాదాపుగా మూడు సంవత్సరాలు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహించిన రాధా అమర్ అప్పటి అధికార పార్టీ టిఆర్ఎస్ లోకి  విచ్చేశారు. ఇక చేసేదేమీ ఏమి లేదనుకొని  గోపాల్ యాదవ్ కూడా టిఆర్ఎస్ లోకి రావడం వెళ్లారు.

2020 సంవత్సరంలో గోపాల్ యాదవ్ రైతుబంధు జిల్లా కమిటీ చైర్మన్ గా బాధ్యతలను అప్పగించారు. ఈ తరుణంలో బిఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో వెంటనే రైతుబంధు కమిటీ జిల్లా చైర్మన్ పదవికి రాజీనామా చేస్తూ జిల్లా కలెక్టర్ కు ఆ పత్రాన్ని అందించి ఆమోదింప చేసుకున్నారు. అనంతరం యధావిధిగా బిఆర్ఎస్ పార్టీ కొనసాగుతూ పార్టీ నిర్వహిస్తున్న కార్యక్రమంలో పాల్గొంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి డాక్టర్ సీ లక్ష్మారెడ్డి కి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ కోడుగల్ యాదయ్య ద్వారా రాజీనామా పత్రాన్ని పంపించారు. కాంగ్రెస్ పార్టీలోకి గోపాల్ యాదవ్ తిరిగి చేరుతారని పలువురు ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు.