21-07-2025 12:22:33 PM
తప్పిన పెను ప్రమాదం
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఘటన
కామారెడ్డి, (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు పూల దుకాణంపై దూసుకెల్లడంతో పెను ప్రమాదం తప్పిన ఘటన కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ డివిజన్ కేంద్రంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి నుండి బోధన్ కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పూల దుకాణంలో కి దూసుకుపోయింది. బస్సు డ్రైవర్ కు పిక్స్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం బస్సు స్పీడ్ కూడా లేకపోవడం వల్ల పెను ప్రమాదం నుంచి అటు ప్రయాణికులు, ఇటు ప్రజలు బయటపడ్డారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. ఎవరికి ప్రమాదం జరగకుండా ఘటన నుంచి ప్రయాణికులు బయటపడ్డారు.
పెను ప్రమాదం నుంచి బయటపడి నా షాక్ నుంచి ప్రయాణికులు కొద్దిసేపు షాక్ నుంచి తేరుకోలేదు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు బాన్సువాడ పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. డ్రైవర్ కు పిట్స్ రావడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ప్రయాణికులు ప్రమాదం నుంచి బయటపడడంతో బస్సు డ్రైవర్ కు ఫిట్స్ రావడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుసుకున్న ఆర్టీసీ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం లో ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడడం సురక్షితంగా ఉండడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వేరే బస్సులో ఎక్కించి బస్సు డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.