calender_icon.png 16 July, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవత్వం చాటుకున్న ఖమ్మం ఎంపీ రఘురాంరెడ్డి

16-07-2025 12:20:09 AM

ఖమ్మం, జులై 15 (విజయ క్రాంతి): గిరిజన తండాకు చెందిన ఓ పేదింటి బిడ్డకు అత్యవసర వైద్య చికి త్స అందించేందుకు హైదరాబాద్ లోని కార్పొరేట్ హాస్పిటల్ లో దగ్గరుండి చేర్పించి, వైద్య సిబ్బందికి సూ చనలు చేసిన   ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురాం రెడ్డి తన మానవత్వాన్ని చాటుకున్నారు.

ఈనెల మూడో తేదీన రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో కలిసి కూసుమంచి మండలం ధర్మ తండా పర్యటనకు వెళ్ళినప్పుడు మంచంలో అచేతన స్థితిలో ఉన్న సింధు పరిస్థితిని కళ్లారా చూసిన మంత్రి, ఎంపీ స్పందించారు. ఈమె తండ్రి ఇటీవల చనిపోవడం, వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేదని తల్లి గోడు వెల్లబోసుకోగా, అక్క నీ బిడ్డకి మెరుగైన వైద్యం హైదరాబాద్ లో చేపిస్తామని మంత్రి,ఎం పి ఆరోజు మంత్రి పొంగులేటి, ఎం పి అభయమిచ్చిన విషయం విధితమే.ఈ క్రమంలో సోమవారం ఎంపీ రఘురాం రెడ్డి స్వయంగా వెళ్లి హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో వైద్య పరీక్షలు, చికిత్స చేయించారు.

న్యూరో సర్జన్ డాక్టర్ భవానీ ప్రసాద్, ఇతర వైద్య సిబ్బందితో మాట్లాడి.. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. తదుపరి వైద్యంపై సంబంధిత వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.  కావాల్సిన మందులు కూడా ఇప్పించి, ఆర్థిక సాయం అందించి ధైర్యంగా ఉండాలని బాధితురాలి కుటుంబ సభ్యులకు సూచించారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని అభయమిచ్చారు.