31 March, 2026 | 1:55 AM

కోతుల బెడదకు పాలకవర్గం ప్రాధాన్యం

31-03-2026 12:00 AM

హుజురాబాద్, మార్చి30: (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీలో నిర్వహించిన పాలకవర్గ సమావేశంలో హుజురాబాద్ ప్రాంత ప్రజల చిరకాల సమస్యకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. కోతుల బెడదను తగ్గించేందుకు నాలుగు లక్షల రూపాయలతో 2026-27 వార్షిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముందుగా ప్రధాన సమస్య అయిన డంప్ యార్డ్ రద్దు నిర్ణయాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.

హుజురాబాద్ పురపాలక సంఘ 2026-27 వార్షిక బడ్జెట్ ను సోమవారంమున్సిపల్ చైర్ పర్సన్ సుహాసిని అధ్యక్షతన, జూనియర్ అకౌంట్స్ ఆపీసర్ ఆరతి ప్రవేశపెట్టారు. 2026-27 వార్షిక సంవత్సరానికి గాను30.69 కోట్ల బడ్జెట్ కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో 26 అంశాలకు గాను 26 అంశాలను ఆమోదించారు. ప్రధానంగా రోడ్ల నిర్మాణానికి రూ. 7 కోట్ల 50 లక్షలు, మురుగు కాలువల నిర్మాణానికి రూ. 6 కోట్లు, విద్యుత్ స్థంభాలు, లైట్ల కోసం కోటి రూపాయలతో పాటు ఔట్ సోర్సింగ్ సిబ్బంది జీతాలకు బడ్జెట్ ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

అలాగే తైబజార్ వేలం వేయగా రూ. 24,21,000 లకు భూం రామకృష్ణ వేలంపాటలో దక్కించుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ గూడూరి అంజలి, పాలకవర్గ సభ్యులు, కమిషనర్ ముసాబ్ అహ్మద్ సయ్యద్, కార్యాలయ మేనేజర్ భూపాల్ రెడ్డి, అసిస్టెంట్ ఇంజనీర్ సుధాకర్ రెడ్డి, సానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్, టి.పి.ఎస్. అశ్వినీ గాంధీ, సీనియర్ సహాయకులు రమేష్ , జూనియర్ అకౌంటెంట్ గోపాల్ రెడ్డి, ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ వినయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.