calender_icon.png 22 August, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బుర్రా వెంకటేశం వీఆర్‌ఎస్‌కు ప్రభుత్వం అనుమతి

05-12-2024 02:33:39 AM

హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయ క్రాంతి): ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్)కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ మేరకు వీఆర్‌ఎస్‌ను ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆయనను టీజీపీఎస్సీ చైర్మన్‌గా ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన విద్యాశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, రాజ్‌భవన్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సేవలందిస్తున్నారు.

డిసెంబర్ 2న ప్రస్తుత టీజీపీఎస్సీ కమిషన్ చైర్మన్ మహేందర్ రెడ్డి పదవీ కాలం ముగియగా, ఆస్థానంలో బుర్రా వెంకటేశంను నియమించారు. గురువారం కమిషన్ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. మూడున్నరేళ్ల పదవీ కాలం ఉండగానే ఆయన వీఆర్‌ఎస్ తీసుకున్నారు. కమిషన్ చైర్మన్‌గా 2030 వరకు బుర్రానే ఉండనున్నారు.