11 June, 2026 | 2:32 AM

బీఆర్‌ఎస్‌పై సర్కారు కక్షసాధింపు

16-06-2024 01:20 AM

బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్

హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): రేవంత్‌రెడ్డి ప్రభుత్వం బీఆర్‌ఎస్‌పై కక్షపూరితంగా వ్యవహరి స్తోందని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆరోపించారు. విద్యాశాఖలో గందరగోళ పరిస్థితి నెలకొందని, కేసీఆర్ ఫొటోలు పాఠ్యపుస్తకాలపై ఉన్నాయని, పుస్తకాలు ప్రభుత్వం వెనక్కి తెప్పించిందని మండిపడ్డారు. తెలంగాణభవన్‌లో శనివారం మాట్లాడుతూ.. తమిళనాడులో స్యూల్ బ్యాగులపై జయలలిత ఫొటోలు ఉన్నా స్టాలి న్ వాటిని విద్యార్థులకు పంపిణీ చేశారని, పుస్తకాలపై ఉద్యమ నేత కేసీఆర్ ఫొటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. అధికారం చేపట్టి ఆర్నెల్లు గడిచినా విద్యాశాఖ మంత్రి లేరని, వానకాలం సీజన్ రైతుబంధుపై ఊసేలేదని, ఓటమి భయంతోనే పార్లమెంటు ఎన్నికల్లో రైతుబంధు డబ్బులు విడుదల చేయలేదని మండిపడ్డారు.

హోంశాఖ సీఎం దగ్గర ఉంచుకు న్నారని, ఆయన సొంత జిల్లాలో పట్టపగలు వ్యక్తిని కొట్టి చంపినా అధికారులు ఎందుకు స్పందించలే దని నిలదీశారు. రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైరవిహారం చేస్తున్నాయని, నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్య స్తంగా మారిందని ఆరోపించారు. ఆశా వర్కర్లకు ఇప్పటివరకు వేతనాలు ఇవ్వలేదని, కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయా లనే కుట్ర తో రేవంత్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు బావులను వేలం వేస్తామని కిషన్‌రెడ్డి ప్రకటన చేస్తే కాంగ్రెస్ నేతలు ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు.