గ్యారెంటీలు విస్మరించి కుంభకోణాలు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ విమర్శ
హైదరాబాద్, జూన్ 15 (విజయక్రాంతి): కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ఆరు కుంభకోణాలకు పాల్పడు తోందని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలం గాణభవన్‌లో శనివారం మాట్లాడుతూ.. బియ్యం, లిక్కర్, ఫ్లుయాష్ కుంభకో ణాలకు తెగబడి ప్రజల సొమ్మును నిలువు నా దోచుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రంలో నడి చేది కాంగ్రెస్ ప్రభుత్వం కాదని, ప్రశ్నించే వారిని బెదిరింపులకు గురిచేసి కేసులు వేసే సర్కారు అని విమర్శించారు. మంత్రి పొన్నం అవినీతికి పాల్పడుతున్నారని, ఫ్లుయాష్ తరలింపుపై ఇటీవల కౌశిక్‌రెడ్డి సవాల్ విసిరినా సమాధానం చెప్పలేదని, తప్పులు కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
జనవరి 11న డిజిట ల్ టికెట్ల కోసం ఇచ్చిన టెండర్‌ను రద్దు చేసి, ఆఫ్‌లైన్ టెండర్ తీసుకొచ్చారని, దీనిలో ఎన్ని సంస్థలు పాల్గొన్నాయి? ఎంతకు కోట్ చేశారో? ప్రజలకు వివరించాలని డిమాండ్‌చేశారు. 2023 ఫిబ్రవరిలో గత ప్రభుత్వం పెట్టిన టెండర్లను రద్దు చేశారని, గుట్టుచప్పుడు కాకుండా చలో మొబిలిటీ సంస్థకు టెండర్ కట్టబెట్టారని పేర్కొన్నా రు. ఆర్టీసీకి వచ్చే కమిషన్ ఆ సంస్థ ఖాతాలోకి నేరుగా వెళ్తోందని, ఆ సంస్థ గణాంకాల ప్రకారం.. ప్రతిరోజు 52 లక్షల టికెట్లు అమ్మి తే 365 రోజులు, 5 ఏండ్లు కోట్లాది రూపాయల దందా జరుగుతోందని, ఇలా ఇంత పెద్ద ప్రాజెక్టును ఎందుకు గోప్యంగా ఉంచారో చెప్పాలని డిమాండ్ చేశారు. నెల రోజుల్లో హుటాహుటిన 14 అమైండ్‌మెంట్లు తీసుకరావడంలో మతలబు ఏమిటని ప్రశ్నించా రు. 13,200 మిషన్లు కొనుగోలు చేశారని, వీటిలో పొన్నం కమీషన్ ఎంత అని ప్రశ్నించారు. లిక్కర్ కుంభకోణం బయటపడితే కేసులు వేస్తామని మంత్రి జూపల్లి బెదిరించారని ఆరోపించారు.






