12-08-2025 08:07:00 AM
ప్రైవేట్ పాఠశాల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి లక్ష్మణ్
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): పదో తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులు అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షదాయకమని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా(Bhadradri Kothagudem District) ప్రైవేటు పాఠశాలల సంఘం జిల్లా అధ్యక్షుడు బండి లక్ష్మణ్ ప్రధాన కార్యదర్శి భాగం విజయ కుమారులు అన్నారు. వారు విడుదల చేసిన ప్రకటనలో గత ఏడాది పదవ తరగతి పరీక్షల్లో ఇంటర్నల్ మార్కులను ప్రభుత్వం రద్దు చేసింది. 2025 _26 విద్యా సంవత్సరంలోనూ ఇంటర్నల్ మార్కులు ఉండవని విద్యార్థులు ఆందోళన చెందుతున్న తరుణంలో, ప్రభుత్వం పునర్ ఆలోచించి ఇంటర్నల్ మార్కులు 20 అంగీకరించడానికి తాము స్వాగతిస్తున్నా మన్నారు. ప్రభుత్వ నిర్ణయం విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుందని వారు అభిప్రాయపడ్డారు.