12-08-2025 01:28:17 AM
హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాం తి): ‘కాంగ్రెస్ అధిష్ఠానం నాకిచ్చిన మంత్రిపదవి హామీని అమలుచేయకుండా రాష్ట్ర ముఖ్యనేతలు అడ్డుకుంటూ, అవమానిస్తున్నారు. వాస్తవాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియా ద్వారా ప్రజలకు వివరించినందుకు ధన్యవాదాలు’ అని మును గోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదని.. ప్రజలకిచ్చిన హామీలను కాంగ్రెస్ సర్కార్ అమలు చేయాలని కోరా రు.
అవినీతిరహిత పాలన అందించాలం టూ సోమవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డికి మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చిన మాట నిజమేనని డిప్యూ టీ సీఎం భట్టి విక్రమార్క ఓ న్యూస్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్న అం శంపై రాజగోపాల్‌రెడ్డి స్పందించారు. తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నేతలు అడ్డుకుంటున్నారనే వాస్తవాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బయటపెట్టారని తెలిపారు.
తెలంగాణ సమాజ ఆకాంక్షలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఉండాలని తాను ఆశిస్తున్నట్టు రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. గత కొన్నిరోజులుగా రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి అంశం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. సీఎం రేవంత్‌రెడ్డిపై ఆయన పలుమార్లు విమర్శలు కూడా చేశారు.