calender_icon.png 12 August, 2025 | 11:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్షన్‌..టెన్షన్‌.. ఎంపీ అవినాష్‌రెడ్డి అరెస్ట్

12-08-2025 08:31:16 AM

కడప: పులివెందులలో(Pulivendula ZPTC By Election) మంగళవారం నాడు హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఎంపీ అవినాష్‌రెడ్డిని(MP Avinash Reddy) పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను కడపకు తరలించారు. వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అవినాష్‌రెడ్డి అరెస్ట్‌ను అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. వేంపల్లిలో సతీష్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అవినాష్ రెడ్డి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మా ఇంట్లో నేను కూర్చుంటే మీకేం ఇబ్బంది.. అప్రజాస్వామికంగా చంద్రబాబు ఎన్నికలు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికలు సజావుగా జరపాలని అవినాష్ రెడ్డి కోరుకున్నారు. హౌస్ అరెస్ట్ చేసుకోవడానికి తనకు అభ్యంతరం లేదని రామ్ గోపాల్ రెడ్డి అన్నారు. ఎన్నికలు జరిగే గ్రామాలకు కూడా తాను వెళ్లనని చెప్పారు.

అవసరమైతే ఇంటి వద్ద భద్రత పెంచుకోండన్నారు. ఒంటిమిట్ట(మ) గొల్లపల్లి పంచాయతీ సర్పంచ్ లక్ష్మినారాయణను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ గామ్ గోపాల్ రెడ్డి అరెస్ట్ కు ప్రయత్నించారు. పులివెందుల, ఒంటిమిట్ట(Ontimitta BY Elections) జడ్పీ టీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం అయింది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. రెండు చోట్ల 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పులివెందులలో 15, ఒంటిమిట్టలో 30 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్‌ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. రెండు చోట్ల భారీగా పోలీసుల మోహరించారు.