calender_icon.png 12 August, 2025 | 5:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎస్‌లతో కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ ‘వీసీ’

12-08-2025 01:47:05 AM

హైదరాబాద్, ఆగస్టు 11 (విజయక్రాంతి): దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎస్‌లతో సోమవారం కేంద్ర కేబినెట్ సెక్రటరీ టీవీ సోమనాథన్ వీడియో కాన్ఫరెన్స్ ‘వీసీ’ నిర్వహించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అమలు చేస్తున్న నియంత్రణల సడలింపు, డీ రెగ్యులేషన్‌పై ఆయన సీఎస్‌లను సమీక్షించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ 23 ప్రాధాన్యత అంశాల్లో.. తెలంగాణలో ఇప్పటికే 12 అంశాలు అమలులోకి వచ్చాయని తెలిపారు.

మరో 10 అమలు ప్రక్రియలో ఉన్నాయని వెల్లడించారు. ఒక అంశాన్ని అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం ఆసక్తి చూపడం లేదని స్పష్టం చేశారు. అలాగే జన విశ్వాస్ బిల్లుకు సంబంధించి వివిధ శాఖల్లోని క్రిమినల్ నిబంధనలను గుర్తించామని, ఇప్పటికే వాటిని ఆయా శాఖలకు పంపించామని తెలిపారు. ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర స్పెషల్ సీఎస్ సంజయ్‌కుమార్, పలువురు ప్రిన్సిపల్ సెక్రటరీలు పాల్గొన్నారు.