calender_icon.png 29 May, 2025 | 12:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుల సంక్షేమమే ప్రాధాన్యతగా ప్రభుత్వ పాలన

17-04-2025 12:51:25 AM

మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు 

మెదక్, ఏప్రిల్ 16(విజయక్రాంతి): రైతన్నల సంక్షేమం ప్రాధాన్యతగా ప్రభుత్వ పాలన  కొనసాగుతుందని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు. బుధవారం నియోజకవర్గ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా చిన్నశంకరంపేట మండలం గవ్వలపల్లి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను మెదక్ ఆర్డీవో రమాదేవి, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో కలిసి ఎమ్మెల్యే రోహిత్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాసంగి 2024-25  వరి పంట కోనుగోలు నిమిత్తం ధాన్యము కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని. కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. నిర్దేశించిన బరువుకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం రైతులు ధాన్యం అమ్ముకోవాలని సూచించారు.