05-01-2026 03:39:58 PM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నాలుగో రోజు(Telangana Assembly sessions) కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రిటైర్డ్ ఉద్యోగులు(Retired Employees Protest) అసెంబ్లీ ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో అసెంబ్లీ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. పింఛన్ దారులకు పాత బకాయిలు చెల్లించట్లేదంటూ ఆందోళన చేపట్టారు. పెండింగ్ డీఏలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బక్క జడ్సన్ సహా విశ్రాంత ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బకాయిలు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు పెండింగ్ బకాయిలు విడుదల చేయలేదని ఫైర్ అయ్యారు.