calender_icon.png 6 January, 2026 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బెజ్జూర్ లో ఆసుపత్రి మంజూరు చేయాలి

05-01-2026 03:44:51 PM

ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి 

బెజ్జూర్,(విజయక్రాంతి): రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో వెంటిలేటర్ల కొరత ఉందని, సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. సోమవారం రాష్ట్ర అసెంబ్లీ సమావేశంలో సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు మాట్లాడారు. గత ప్రభుత్వం 30 పడగల ఆసుపత్రి నిర్మాణం కోసం శంకుస్థాపనలు చేశారే తప్ప ఆసుపత్రి నిర్మాణం నోచుకోలేదని అన్నారు. ఆసుపత్రిలో మారుమూల ప్రాంతాల నుండి వచ్చిన రోగులకు వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.బెజ్జూర్ సామాజిక ఆసుపత్రి శిథిలావస్థలో ఉందని,నూతన ఆస్పత్రి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు కోరారు.