05-01-2026 04:18:55 PM
కోనసీమ: అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ మోరీ-5 వెల్ లో మంటలు చెలరేగాయి. ఓఎన్‌జీసీ వర్క్ ఓవర్ రిగ్ సైట్ లో అగ్నిప్రమాదం సంభవించింది. గ్యాస్ లీక్ తో పెద్దఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మలికిపురం మండలం ఇరుసుమండలో 12.30 గంటలకు గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ తో వంద అడుగులకుపైగా మంటలు ఎగసిపడుతున్నాయి. తహసీల్దార్ శ్రీనివాస్ రావు ఘటనాస్థలిని పరిశీలించారు. ఇరుసుమండ ప్రజలను రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. రెవెన్యూ అధికారుల అప్రమత్తతతో ప్రజలు గ్రామం ఖాళీ చేశారు. ఇరుసుమండలో కొబ్బరి తోటలు పెద్దఎత్తున దగ్ధమవుతున్నాయి. పెద్దఎత్తున మండలు వ్యాపించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. స్థానిక అధికారులు ఓఎన్జీసీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అధికారుల సమాచారంతో ఓఎన్జీసీ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. కలెక్టర్, ఎస్పీ, ఎంపీ ఘటనాస్థలంలో పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. చుట్టుపక్కల 5 కిలో మీటర్ల పరిధిలో ఉన్న ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇరుసుమండ పరిసరాల్లో భీకర శబ్దాలతో మంటలు ఎగసిపడుతున్నాయి.