calender_icon.png 6 January, 2026 | 9:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలవరం-నల్లమలసాగర్‌పై విచారణ వాయిదా

05-01-2026 03:04:15 PM

న్యూఢిల్లీ: పోలవరం-నల్లమల సాగర్ లింకు ప్రాజెక్టుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఏపీ ఉల్లంఘనలకు పాల్పడటానికి సిద్ధమైందనేది ఆరోపణ అని సీజేఐ ధర్మాసనం తెలిపింది. కమిటీ ఏర్పాటు చేశారని మీరే చెబుతున్నారని సీజేఐ వెల్లడించారు. కమిటీని అన్ని విషయాలపై నివేదిక ఇవ్వనీయండన్నారు. సివిల్ సూట్ లో జోక్యం చేసుకుని నిలుపుదల చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉందా? సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మధ్యంతర ఉపశమనం కల్పించాలని సింఘ్వీ కోరుతున్నాని తెలిపారు.

ఏపీ కేవలం ప్రాజెక్టు నివేదిక కోసమే టెండర్లు పిలవాలని చేస్తోందని, జాతీయ ప్రాజెక్టుల విషయంలో కేంద్రానికి న్యాయపరిధి ఉంటుందని కోర్టు తెలిపింది. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు నివేదికపై అభ్యంతరమేంటని ఏపీ లాయర్ ముకుల్ రోహత్గి అన్నారు. ''నా ఇల్లు.. నేను కట్టుకోవాలనుకుంటే మీకు అభ్యంతరమేంటి. నా భూభాగంలో చేపట్టే ప్రాజెక్టు నివేదిక తయారు చేసుకుంటే అభ్యంతరం ఎందుకో?'' అని ముకుల్ ప్రశ్నించారు. సీమలో కరువు ప్రాంతానికి నీటిని తీసుకెళ్లడానికే ప్రాజెక్టు ప్రతిపాదన అన్నారు. ఎక్కడా.. ఏ ఉత్తర్వులు, తీర్పులు ఉల్లంఘనలు ఈ ప్రాజెక్టులో లేవని చెప్పారు. పరివాహక ప్రాంత రాష్ట్రాల అభ్యంతరాలు పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

ఈ ప్రాజెక్టు వల్ల ఏ ఒక్క రాష్ట్రానికి నష్టం జరగదని ముకుల్ రోహత్గి సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. ఏపీ ప్రభుత్వం తరుఫున మరో న్యాయవాది జగదీప్ గుప్తా వాదనలు వినిపించారు. ప్రాజెక్టు నివేదిక, అధ్యయనానికి కేంద్ర అనుమతి తీసుకున్నామని జగదీప్ వెల్లడించారు. తెలంగాణ మాత్రం గోదావరిపై వందల ప్రాజెక్టులు నిర్మిస్తోందన్నారు. పరివాహక రాష్ట్రాల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని సీజేఐ తెలిపింది. అందరి అభిప్రాయాలతోనే తదుపరి విచారణ కొనసాగిస్తామని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. మధ్య వర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదని కోర్టు ప్రశ్నించింది. పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 12 కు వాయిదా వేసింది.