calender_icon.png 6 January, 2026 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోము

05-01-2026 02:41:26 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పమని మంత్రి సీతక్క అసెంబ్లీలో అన్నారు.  క్యాంటీన్ల నిర్వహణ, పెట్టుబడి కోసం ఎస్ హెచ్ జీ సభ్యులకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామని తెలిపారు. ఎస్ హెచ్ జీ సభ్యులకు 10 రోజుల పాటు హైదరాబాద్ లో శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 250 క్యాంటీన్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. క్యాంటీన్ల నిర్వహణ, షెఫ్ శిక్షణకు ఒక్కొక్కరికి రూ. 22,300 చొప్పున వ్యయం ఖర్చు చేసినట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో 130 ఐఎంఎస్ క్యాంటీన్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దశలవారీగా మరిన్ని క్యాంటీన్ల ఏర్పాటుకు ప్రభుత్వం యోచిస్తోందని సీతక్క సూచించారు. 60 ఏళ్లు దాటిన వారికీ మహిళా సంఘాల్లో అవకాశం కల్పించామని వెల్లడించారు. 15 ఏళ్లు దాటిన అమ్మాయిలకు మహిళా సంఘాల్లో చోటు కల్పించామన్నారు.