05-01-2026 05:09:43 PM
హైదరాబాద్: ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో తెలంగాణ వాళ్లు 17 మంది ఉన్నారని డీజీపీ శివధర్ రెడ్డి(DGP Shivdhar Reddy) వెల్లడించారు. నలుగురు కేంద్ర కమిటీలో, ఐదుగురు రాష్ట్ర కమిటీలో ఉన్నారని డీజీపీ సూచించారు. ఆరుగురు డివిజన్ కమిటీలో, ఒకరు అండర్ గ్రౌండ్ లో ఉన్నారని తెలిపారు. మిగిలిన 17 మంది లొంగిపోవాలని డీజీపీ శివధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 17 మంది లొంగిపోతే మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ మారుతోందన్నారు. ఆపరేషన్ కగార్ గడువులోపే తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రం అవుతుందని తెలిపారు. ఇంకా మావోయిస్టు పార్టీలో ఉన్న 17 మందిలో ఐదుగురు మహిళలు ఉన్నారని డీజీపీ వెల్లడించారు. 17 మంది తెలంగాణ మావోయిస్టులపై రూ. 2.25 కోట్ల రివార్డు ఉందని శివధర్ రెడ్డి చెప్పారు.