calender_icon.png 10 January, 2026 | 1:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అధికారుల నిర్లక్ష్యంతోనే ప్రభుత్వ భూములు మాయం

08-01-2026 12:00:00 AM

కేసముద్రం, జనవరి 7 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లనే కేసముద్రం మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రభుత్వ స్థలాలు మాయం అయ్యాయని సిపిఐ మండల నా యకులు మంద భాస్కర్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ 2019 సంవత్సరంలో ‘ఇది ప్రభుత్వ భూమి దీని ఆక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును’ హెచ్చరిక బోర్డులను రెవెన్యూ శాఖ అధికారులు ప్రభుత్వ స్థలాలలో పెట్టడం జరిగిందని, హెచ్చరిక బోర్డులను తొలగించి స్థలాలను ఆక్రమించుకుంటున్నా కూడా రెవెన్యూ శాఖ అధికారులు కళ్ళున్న కబోదిలా వ్యవహరించారని విమర్శించారు.

సిపిఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ స్థలాలను కాపాడాలని, ప్రభుత్వ భూములు పేద ప్రజలకు లేక ప్రభుత్వ కార్యాలయాలకు ఉపయోగపడాలని అనేకసార్లు ఆందోళనలను నిర్వహించామన్నారు. భూ కబ్జాదారులకు రెవెన్యూ శాఖ అధికారులు సహకరించడం వల్లనే ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమించుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పడిన సందర్భంగా మున్సిపాలిటీ కేంద్రంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు మంజూరు అయినప్పటికీ వాటిని నిర్మించడానికి స్థలాలు లేకపోవడం అధికారుల నిర్లక్ష్యమే కారణమన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ శాఖ అధికారులు త్వరగా చొరవ చూపి అన్యాక్రాంతమైన ప్రభుత్వ స్థలాలను ఆధీనంలోకి  తీసుకొని, తక్షణమే ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు.