calender_icon.png 11 January, 2026 | 3:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేషనల్ ఫిస్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ సాధించాలి

08-01-2026 12:00:00 AM

జంపన ప్రతాప్

సికింద్రాబాద్, జనవరి 7 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర జూనియర్ ఫిస్ట్‌బాల్ జట్లు జనవరి 9 నుండి 11 తేదీలలో కర్నాటకలోని చిక్కబళ్లాపూర్లోని కేవీ క్యాం పస్లో జరగనున్న 16వ జూనియర్ నేషనల్ ఫిస్ట్ బాల్ ఛాంపియన్షిప్లో పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా న్యూ బోయినపల్లి ప్లే గ్రౌండ్లో తెలంగాణ ఫిస్ట్ బాల్ అసోసియేషన్ చైర్మెన్ జంపన ప్రతాప్, అధ్యక్షులు స్నేహ ముఖ్య అతిధులుగా హాజరై ఈ రోజు క్రీడాకారులకు స్పోరట్స్ కిట్స్ అందజేశారు.

ఈ సందర్భంగా నేషనల్ ఫిస్ట్ బాల్ ఛాంపియన్షిప్ సాధించాలని జంపన ప్రతాప్ ఆకాంక్షించారు. హైదరాబాద్‌కు చెందిన క్రీడాకారుడు సిద్దు బాలుర జట్టుకు, రబియా బాలికల జట్టుకు కెప్టెన్‌గా నాయకత్వం వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వెంకటేష్, ఇరు జట్ల కోచ్ లు లునవత్ సంతోష్,సలోని, అసిస్టెంట్ కోచ్ లు అయేషా,నరేష్ బానోత్ తదితరులు పాల్గొన్నారు.