13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

హైడ్రా పరిధిలోకి ప్రభుత్వ పార్కులు

31-03-2026 01:21 AM
  1. పార్కు స్థలాలను కబ్జా చేస్తే క్రిమినల్ కేసులు

పార్కు  కబ్జాకు యత్నించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి

జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

ముషీరాబాద్, మార్చి 30(విజయక్రాంతి): పార్కు స్థలాలు హైడ్రా పరిధిలోకి వస్తాయని ఎవరైనా కబ్జా చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్  హెచ్చరించారు. హైదరాబాద్ ఇందిరా పార్క్‌లో కరాటే కోచింగ్ సెంటర్ పేరుతో పార్కు స్థలాన్ని కబ్జా చేయడానికి యత్నించిన వ్యక్తిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన  అధికారులను ఆదేశించారు. 

ఇందిరాపార్కులో గత కొంత కాలంగా వేసవి శిక్షణ శిబిరాల పేరుతో కొనసాగుతున్న కరాటే కోచింగ్ సెంటర్ నిర్వాహకుడు కోచింగ్ సెంటర్లో నిర్మాణ చేస్తున్న అక్రమ కట్టడాలను అడ్డుకోవాలని దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇందిరాపార్కు వాకర్స్ హైడ్రాకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం ఇందిరాపార్కులోని కరాటి కోచింగ్ సెంటర్లో ఆక్రమంగా నిర్మాణాలు చేపడుతున్న స్థలాన్ని హైడ్రా కమిషనర్ రంగనాధ్,  జీహెచ్‌ఎంసీ స్పోరట్స్ విభాగం అధికారులు. కవాడిగూడ సర్కిల్ డిఎంసీ ఆర్.  పుష్పలత, వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు.

స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాధ్ మాట్లాడుతూ ఇందిరాపార్కులో కరాటే కోచింగ్ సెంటర్ పేరుతో జీహెచ్‌ఎంసీ ఎలాంటి రుసుము చెల్లించకుండా జీహెచ్‌ఎంసీ అధికారులు. పార్కుకు సంబందించిన అధికారులకు సమాచారం లేకుండా శాశ్వత ప్రతిపాదికన షెడ్డు నిర్మాణానికి యత్నించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఆధికారులను ఆదేశించారు.

వారం రోజుల్లో కాంట్రాక్టర్, కరాటే కోచింగ్ సెంటర్ నిర్వాహకులు వెంటనే స్పందించి కూల్చిన ఇందిరాపార్కు ప్రహారీని నిర్మించాలని లేని పక్షంలో నిర్మాణ సామాగ్రిని వేలం వేసి ఈ నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత పార్కు అధికారులు,  జీహెచ్‌ఎంసీ స్పోరట్స్ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ పార్కులు హైడ్రా పరిధిలోకి వస్తాయని ఎవరైనా వారి స్వార్థం కోసం పార్కు స్థలాన్ని కబ్జా చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో కవాడిగూడ సర్కిల్ డిఎంసీ ఆర్.  పుష్పలత, ఇందిరాపార్కు డిడి చంద్రశేఖర్, జీహెచ్‌ఎంసీ డిఈ, హైడ్రా అధికారి నరసింహా రావు, స్పోరట్స్ మెయిసుద్దీన్, స్పోరట్స్ అసిస్టెంట్ కె.  శ్రీనివాస్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ మేనేజర్ కృష్ణయ్య ఇందిరాపార్కు సూపర్ వైజర్ మౌనిక, సెక్యూరిటీ సిబ్బంది, వాకర్స్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.