24-05-2025 12:27:20 AM
- లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేత
- భూమి పూజలు చేసిన ఎమ్మెల్యే డా.కవ్వంపల్లి
మానకొండూర్,మే23(విజయక్రాంతి): నిరుపేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పథకాలు అమలు చేస్తున్నదని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. శుక్రవారం శంకరపట్నం మండలం తాడికల్, ఆముదాలపల్లి,కేశవపట్నం గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఆయన లబ్ధిదారుల తో కలిసి భూమి పూజ చేశారు.
ఈ సందర్భ ంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు హామీల విషయ ంలో ప్రతిపక్షాలు ప్రజల్లో అపోహలు సృ ష్టించే ప్రయత్నం చేశాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిస్థాయిలో అమలు చేస్తామని, అందులో భా గంగానే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మ ంజూరు పత్రాలు అందజేస్తూ భూమి పూ జలు నిర్వహిస్తున్నామని చెప్పారు. త్వరలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందని, ఆ వెనువెంటనే పెన్షన్లు ఇస్తామని ఆయన వివరించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనక ంగా లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ పథకాల అమలను కొనసాగించి తీరుతామని ఎమ్మెల్యే డాక్టర్ క వ్వంపల్లి సత్యనారాయణ స్పష్టం చేశారు. ప్ర భుత్వం ఇళ్లు లేని నిరుపేదలైన లబ్ధిదారులందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తుందని, వెంటనే ని ర్మాణాలు ప్రారంభించి తొందరగా పూర్తి చే సుకోవాలని తెలిపారు. నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు.
లబ్ధిదారులందరూ సకాల ంలో నిర్మాణపు పనులు చేపట్టి ఇళ్లను ని ర్మించుకునేందుకు తోడ్పాటు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమ ంలో శంకర పట్నం మ ండల పరిషత్ అభివృద్ధి అధికారి గోల్కొండ కృష్ణ ప్రసాద్, మండల తహసిల్దార్ సురేఖ, ఎంపీఓ ప్రభాకర్, పిడి గ ంగాధర్ , గృహ ని ర్మాణ సంస్థ డివిజనల్ ఇంజనీర్ వెంకట్ రమణ ఏఈ మూద్ అలీ మాజీ జెడ్పిటిసి బత్తిని శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు గోపగోని బసవయ్య, బ్లాక్ తదితరులు పాల్గొన్నారు.