calender_icon.png 25 May, 2025 | 6:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లా మ్యాగీ ఆరోపణలపై విచార‌ణ చేప‌ట్టాలి: కేటీఆర్

25-05-2025 12:16:05 PM

హైదరాబాద్: మిస్ వరల్డ్-2025(Miss World-2025) లాంటి అంతర్జాతీయ వేదికలపై మహిళల పట్ల వివక్షాపూరిత ఆలోచనలు ఉన్న మెంటాలిటీనీ ఎదిరించడానికి చాలా ధైర్యం కావాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ తెలంగాణ పర్యటన సందర్భంగా ఎదుర్కొన్న వేధింపులను కె.టి. రామారావు ఆదివారం ఖండించారు మిల్లా మ్యాగీ(Miss England Milla Magee) ఒక బలమైన మహిళ, మా తెలంగాణలో మీరు ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నందుకు మేము చింతిస్తున్నామని పేర్కొన్నారు.

తెలంగాణలో మహిళలను గౌరవించే గొప్ప సంస్కృతి ఉంది. ఇక్కడ మహిళలను పూజిస్తాము, గౌరవిస్తాము, వారి అభివృద్ధికి సమాన అవకాశాలను కల్పిస్తామన్న కేటీఆర్ రాణి రుద్రమ(Rudrama Devi), చిట్యాల ఐలమ్మ వంటి గొప్ప నాయకులు  తెలంగాణ మట్టిలో పుట్టినవారే అన్నారు. దురదృష్టవశాత్తు, మీరు ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం నిజమైన తెలంగాణను ప్రతిబింబించేది కాదని తెలిపారు. మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. ఏ ఒక్క మహిళ గానీ, ఆడపిల్ల గానీ ఇలాంటి భయానక అనుభవాలను ఎదుర్కోకూడదని ఒక అమ్మాయికి తండ్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao) తెలిపారు. బాధితురాలిని విమర్శించడం, ఆమెను తప్పుగా చూపించడాన్ని కేటీఆర్ ఖండించారు. అలాగే మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ( Milla Magee) చేసిన ఆరోపణలపై సంపూర్ణంగా విచారణ జరగాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌  డిమాండ్  చేశారు.