calender_icon.png 25 May, 2025 | 7:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులను రోడ్డుపాలు చేసిన రేవంత్ సర్కార్

24-05-2025 12:25:27 AM

జెడ్పి మాజీ చైర్‌పర్సన్ దావ వసంత 

జగిత్యాల అర్బన్, మే 23 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతును రాజు చేస్తానని చెప్పి అదే రైతును రోడ్డు పా లు చేశాడని మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆరోపించారు. శుక్రవా రం రాయికల్ మండలంలోని శ్రీరాంనగర్, సింగర్రావుపేట్ గ్రామాల్లో అకాల వర్షాలతో తడిచిన వరి ధాన్యాన్ని  రైతులు, నాయకులతో కలిసి మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వ సంత పరిశీలించారు.

అకాల వర్షాలతో కల్లాలలోని ధాన్యం మొలకెత్తుతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడడం లేదని ఆరోపించారు. రైతులకు మద్దతుగా రోడ్డు పై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ ఆరుగాలం ఎంతో కష్టపడి పండిం చిన ధాన్యం  చేతికి అందేలోగా అకాల వర్షాలతో  తడిసి ముద్దైందనీ, ప్రభుత్వం వెంటనే స్పందించి తడిచిన ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డి మాండ్ చేశారు.

రేవంత్ ప్రభుత్వం రైతుని రాజుని చేస్తానని 

రోడ్డు పాలు చేసిందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు బర్కాం మల్లేష్, నాయకులు చాంద్, రాజేశ్వర్ రెడ్డి, జలపతిరెడ్డి, గంగరెడ్డి, రాజమౌళి, చంద్రయ్య, శ్రీను, రైతులు, మహిళలు పాల్గొన్నారు.