25-05-2025 12:19:39 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): గత మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాల కారణంగా మండల కేంద్రంలోని వరి కొనుగోలు కేంద్రాన్ని కిషాన్ సేల్ కార్పొరేషన్ ఛైర్మెన్ అన్వేష్ రెడ్డి(Kishan Sale Corporation Chairman Anvesh Reddy) ఆదివారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తప్పకుండా కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. రైతులు ఎవరూ కూడా అధైర్య పడవద్దని, కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం రైతుల సంక్షేమమేనని గత భారాస ప్రభుత్వం తీరు నిర్లక్ష్య బాధ్యత రేవంత్ సర్కార్ వహించబోదని పేర్కొన్నారు. ఆయన వెంట తాజా మాజి జెడ్పీటీసీ సభ్యుడు పత్తీ రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ ఐరా నారాయణ రెడ్డి, నాయకులు ఒలత్రి నారాయణరెడ్డి, అట్ల ముత్యం రెడ్డి, కండేల భూమన్న, నక్క రాజన్న, తదితరులు ఉన్నారు.