calender_icon.png 25 May, 2025 | 6:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతిమంగా మా నాయకుడు కేసీఆర్: గంగుల కమలాకర్

25-05-2025 01:08:45 PM

మేం కేసీఆర్ బాటలోనే నడుస్తాం

ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు

కవిత పార్టీ పెడతారనేది ఊహాజనితమే: గంగుల కమలాకర్


హైదరాబాద్: అంతిమంగా మా నాయకుడు కేసీఆర్ అని మాజీ మంత్రి గంగుల కమలాకర్(Former Minister Gangula Kamalakar) అన్నారు. తాము కేసీఆర్ బాటలోనే నడుస్తామని గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చని ఆయన వెల్లడించారు. కవిత పార్టీ పెడతారనేది ఊహాజనితమేనని కమలాకర్ తెలిపారు. కాగా, బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) పార్టీలో రాజకీయం రసవత్తరంగా మారింది.

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) పార్టీ అధినేత, తండ్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) కు రాసిన లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. ''కేసీఆర్‌ దేవుడు.. కానీ, కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి.. అతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏంటి?.. నా లేఖే బయటకు వచ్చిదంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి?''కవిత ప్రశ్నించారు. కవిత రాసిన లేఖపై శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పందించారు. బీఆర్ఎస్ పార్టీలో అధినేతకు లేఖ రాసే స్వేచ్చ ఉందంటూ కవితకు పరోక్షంగా కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. పార్టీలో సూచనలు చేయాలనుకుంటే ఎవరైనా లేఖలు రాయొచ్చు అన్నారు. అంతర్గతంగా మాట్లాడుకునే విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని కేటీఆర్‌ సూచించారు.