01-05-2025 12:29:10 AM
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 30:పదో తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా రాణించారు. బుధవారం వెలువడిన 10వ తరగతి ఫలితాలలో జిల్లా మొత్తం లో 92 శాతం పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 19 మంది ఉన్నారు.
అందులో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రాయపోలు విధ్యార్థులు ఇద్దరు గంగిరెడ్డి సాన్వీరెడ్డి, బండ సౌమ్య 92శాతం పైగా మార్కులు సాధించారు. ఇలా అనేక మంది విద్యార్థులు మంచి మార్కులు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం, గ్రామ పెద్దలు అభినందించారు.