25-05-2025 12:00:00 AM
-భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ అధ్యక్షుడు జస్ రాజ్ శ్రీశ్రీమల్
ముషీరాబాద్, మే 24 (విజయక్రాంతి) : గోవుల అక్రమ రవాణాను అడ్డుకోవాలని భారతీయ ప్రాణి మిత్ర సంఘ్ అధ్యక్షులు జస్ రాజ్ శ్రీశ్రీమల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘ్ సెక్రటరీ మహేష్ అగర్వాల్, ఉపాధ్యక్షులు జస్మత్ పటేల్, జాయింట్ సెక్రెటరీ రిదేశ్ జాగిర్ధార్ లతో కలిసి ఆయన మాట్లాడారు. బక్రీద్, ఇతర రోజులలో ఆవులు, దూడలు ఎద్దులను అక్రమంగా వధించడాన్ని రాష్ట్ర ప్రభుత్వం చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ గోవధ నిషేధ, జంతు సంరక్షణ చట్టం, 1977ను ఉల్లంఘిస్తూ, ముఖ్యంగా బక్రీద్ రోజున అసాంఘిక శక్తులు ఎప్పటిలాగే ఆవులు, దూడలు, ఎద్దులను చట్టవిరుద్ధంగా వధించడంలో పాల్గొనే ప్రయత్నాలను అడ్డుకోవా లన్నారు. గత సంవత్సరం బక్రీద్ రోజున సుమారు 10 వేల పశువులను వధించారని చెప్పారు.
హైదరాబాద్ నగర కమిషనరేట్ చుట్టూ చెక్పోస్టులను ఏర్పాటు చేయాలని శ్రీశ్రీమాల్ సూచించారు. జంతువులను రవాణా చేసేటప్పుడు, లారీలో 6 కంటే ఎక్కువ జంతువులను అనుమతించకూడదని చట్టంలో స్పష్టంగా ఉందని వివరిం చారు. గోవుల వధ గురించి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర డీజీపీ జితేందర్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించామని తెలిపారు.
గోవధను నిరోధించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, పోలీస్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆవులు, దూడలు, ఎద్దులను వధించకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.