31 May, 2026 | 5:24 PM

యాగశాలను ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు

31-05-2026 04:30 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని మార్కండేయ కాలనీలో గల శ్రీ పెరిగిద్ద ఆంజనేయ స్వామి దేవాలయం సమీపంలో నిర్వహిస్తున్న శ్రీ ధర్మశాస్త్ర గోశాలలో ఆదివారం జరిగిన చండీ హోమం, ప్రత్యేక పూజ కార్యక్రమాలలో రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు పాల్గొని నూతన యాగశాలను ప్రారంభించారు.

కీర్తిశేషులు సర్వ  శేఖర్ య్యా జ్ఞాపకార్థం భార్య సర్వ రమల మూడు లక్షల రూపాయలతో ఈ గోషలను నిర్మించడం జరిగింది, ఇందులో కూతుర్లు కోడళ్ళు చందజ్యోతి హనుమాండ్లు, వేల్పుల అనురాధ సంజీవ్, లెక్కల పల్లవి గంగాధర్ దంపతులు ఈ చండీయాగం లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.  అనంతరం గోశాల అధ్యక్షులు  బండారి సూర్య, సుల్తానాబాద్ మాజీ జెడ్పిటిసి డాక్టర్ అయిల రమేష్ ల ఆధ్వర్యంలో విజయ రమణారావును ఘనంగా సన్మానించారు. కాసేపు విజయ రమణారావు గో సేవ చేస్తూ ఆనందంగా గోశాలలో గడిపారు.  వేద పండితులు ఉప్పర మల్యాల లక్ష్మణ్ శర్మ చండీయాగం కార్యక్రమాన్ని ఘనంగా జరిపారు.