calender_icon.png 20 August, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నష్టపోయిన కేబుల్ ఆపరేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలి

19-08-2025 11:29:21 PM

మేడ్చల్ అర్బన్: మేడ్చల్ పట్టణంలో విద్యుత్ శాఖ అధికారులు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా, ఏకపక్షంగా కేబుల్ తీగలను తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మేడ్చల్ పట్టణ బిజెపి అధ్యక్షురాలు జెల్లీ శైలజ హరినాథ్ అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. విద్యుత్ అధికారుల చర్య వల్ల కేబుల్ ఆపరేటర్లు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారని తెలిపారు.

కేబుల్ ఆపరేటర్లకు న్యాయం చేయాలని, విద్యుత్ అధికారులు, ప్రభుత్వం వారిని ఇబ్బందులకు గురి చేయవద్దని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తరఫున డిమాండ్ చేస్తున్నట్లు శైలజాలన తెలిపారు. ఇలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు అందించకుండా కేబుల్ తీగలు తొలగించడం సరికాదని ఆమె మండిపడ్డారు.