6 July, 2026 | 3:44 PM

Breaking News

ప్రభుత్వ పాఠశాలలో పెన్నులు, బుక్స్ పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ కె. హరిత   •   శ్రీ రాజరాజేశ్వర స్వామి నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం   •   టెండర్లు పూర్తికాగానే తాసిల్దార్ కార్యాలయానికి భూమి పూజ   •   ఓటరు జాబితా సవరణపై ఆదివాసి గ్రామాల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు.   •   విజయక్రాంతి వార్తకు స్పందన.. రోడ్లపై బురద చెత్త తొలగింపు   •   డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీకి నివాళులు   •   పర్యాటక శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష   •   సులానగర్‌లో కాంగ్రెస్ గ్రామ శాఖ కమిటీ ఎన్నికలు   •   పెరిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడిగా తిరుపతి   •  

మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం అడుగులు

24-06-2025 12:51 AM

మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ 

జూన్ 23(విజయక్రాంతి): చిరు ధాన్యాల ఆహారాన్నిప్రజలు స్వీకరించడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం మన సొంతమవుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం చిన్నశంకరంపేట మండలం ఇందిరా మహిళా శక్తి ద్వారా ఏర్పాటు చేసిన చిరు ధాన్యాల స్టాల్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరా మహిళా శక్తి శంకరంపేట మండలం మహిళ ద్వారా కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన చిరు ధాన్యాల స్టాల్ సందర్శించడం జరిగిందని, బ్రాండింగ్ (నిర్దిష్ట పేరు) కల్పించినట్లయితే మార్కెటింగ్ సౌకర్యం పెరుగుతుందని తెలిపారు. మిల్లెట్స్ గ్రామీణ ప్రాంత ప్రజలు మాత్రమే వాడతారని ఒక అపోగా ఉండేదని,  కాలక్రమేణ చిరు ధాన్యాల ప్రాధాన్యత, పట్టణ ప్రాంతవాసులు ఆదరణ పెరిగి వారు వినియోగించి ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని తెలిపారు.

జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో హైదరాబాదులో మిల్లెట్ స్టాల్ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతి సోమవారం ప్రజావాణికి  వచ్చిన ప్రజలే కాకుండా వివిధ శాఖల  అధికారులు సిరి ధాన్యాల స్టాల్ సందర్శించి కొనుగోలు చేయడం ద్వారా మహిళలకు ఉపాధి మార్గాలు చేకూరుతున్నాయని తెలిపారు

కోటి మహిళలను కోటీశ్వరులను చేయాలని ప్రభుత్వ లక్ష్యాల మేరకు మహిళా సాధికారత ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్ ,డిఆర్డిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య,  మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు.