11 August, 2026 | 1:14 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి

24-06-2025 12:52 AM

సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి 

సిద్దిపేట, జూన్ 23 (విజయక్రాంతి):  జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని కలెక్టర్ హైమావతి సూచించారు సోమవారం కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ సంబంధిత విభాగాలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు బడిబాట వేసవికాలంలో జరిగిన ఉపాధ్యాయులకు శిక్షణ, పాఠ్యపుస్తకాల, యూనిఫామ్ పంపిణీ, ఓపెన్ స్కూల్స్ అడ్మిషన్స్ ఉల్లాస్ పథకం అమలు తీరు గడిచిన అకాడమిక్ లో పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులు సాధించిన ఫలితాలు తదితరాంశాలపై ఆరా తీశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలోనే క్లిష్టమైన అంశాలను సులువుగా అర్థమయ్యేలా అభ్యాసన చేయించాలని ఆదేశించారు ఫలితాల ఆధారిత బోధన జరగాలని నిర్దేశించారు. మండల విద్యాధికారులు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు తగు రీతిలో సమీక్షలు నిర్వహించాలని ఖచ్చితమైన మానిటరింగ్ చేస్తూ ప్రోటోకాల్ పాటించాలని ఆదేశించారు నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి, డిఐఈఓ రవీందర్ రెడ్డి, సమగ్ర శిక్షణా కోఆర్డినేటర్లు, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.