ఘనంగా అమ్మవారి జయంతి ఉత్సవాలు
ముఖ్య అతిధిగా పాల్గొన్న మున్సిపల్ చైర్మన్ నాందారం ప్రశాంత్
కొడంగల్, ఏప్రిల్ 26(విజయక్రాంతి): కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య సమాజానికి ఆధ్యాత్మిక దారిదీపంగా నిలిచిన వాసవి మాత జయంతిని అత్యంత భక్తి శ్రద్ధలతో సాంప్రదాయంగా నిర్వహించారు. కొడంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత చిత్రపటానికి పూలమాలలు వేసి వేదమంత్రాలు పూజలు ప్రత్యేక అర్చన హోమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నందారం ప్రశాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ వాసవి మాత త్యాగం అహింస,సమానత్వం వంటి విలువలు నేటి సమాజానికి మార్దర్శకమని తెలిపారు. వాసవి మాత జయంతి వంటి పర్వదినాలు సమాజంలో ఆధ్యాత్మిక చైతన్యానికి పెంపొందించడమే కాకుండా పరస్పర సహకారం ఐక్యత అని అన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శంకర నాయక్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ కో ఆప్షన్ నెంబర్లు మహిళా విభాగం నుండి స్వాతి సవిత, అనిత, మమత ప్రసన్న,లక్ష్మి,గీత మరియు కొడంగల్ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు ఆకుల ప్రవీణ్ కుమార్ ఆర్యవైశ్య ట్రస్ట్ అధ్యక్షుల విశ్వనాథ్ పూరి శేఖర్ మధు నారాయణ తదితరులు పాల్గొన్నారు.






