1 August, 2026 | 1:07 AM

సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

01-08-2026 12:00 AM

కురుమ కార్పొరేషన్ ఏర్పాటుపై కీలక చర్చ 

యాదగిరిగుట్ట, జూలై 31: హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రభుత్వ విప్, బీర్ల అయిలయ్య, కురుమ సంఘం రాష్ట్ర చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ  కురుమ సామాజిక వర్గానికి సంబంధించిన పలు అంశాలపై సీఎంతో  విస్తృతంగా చర్చించామని.

రాష్ట్రంలో కురుమ కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లగా ఆగస్టు 15వ తేదీలోపు కురుమ కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య తెలిపారు. ఈ నిర్ణయం కురుమ సామాజిక వర్గం ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న ఆకాంక్ష నెరవేరుతుందని తెలిపారు. సీఎం ఇచ్చిన హామీ పట్ల కురుమ సమాజంలో ఆనందం వ్యక్తమవుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా యావత్ కురుమ కులస్తుల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపినట్లు తెలిపారు.