1 August, 2026 | 1:08 AM

తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవికి అవకాశం కల్పించాలి

01-08-2026 12:00 AM
  1. రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
  2. అడ్లూరి లక్ష్మణ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన రవీందర్ రెడ్డి

చౌటుప్పల్, జూలై 31 : తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవికి తనను పరిశీలించి అవకాశం కల్పించాలని కోరుతూ రవీందర్ రెడ్డి రాష్ట్ర రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని దివ్యాంగుల అభ్యున్నతికి సేవలు అందించే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించాలని, ముఖ్యంగా తెలంగాణ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవికి తన పేరును పరిశీలించాలని మంత్రులను కోరినట్లు తెలిపారు.దీనిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గౌరవ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కి సిఫారసు లేఖ పంపించినట్లు రవీందర్ రెడ్డి వెల్లడించారు. మంత్రి  స్పందన పట్ల ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

అదేవిధంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం నుంచి తీసుకువచ్చిన పవిత్ర ప్రసాదాన్ని ఇద్దరు మంత్రులకు అందజేసి ఆశీర్వాదాలు పొందినట్లు పేర్కొన్నారు.దివ్యాంగుల సంక్షేమం, ఉపాధి, స్వయం ఉపాధి, విద్య మరియు వైద్య సేవలు మరింత బలోపేతం కావాలనే లక్ష్యంతో పని చేయడానికి తాను కట్టుబడి ఉన్నానని రవీందర్ రెడ్డి తెలిపారు.ఈ భేటీలో పలువురు దివ్యాంగుల సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.