1 August, 2026 | 1:07 AM

వీబీజీ రాంజీ ఉద్యోగులకు పేస్కేల్ అమలు చేయాలి

01-08-2026 12:00 AM

జిల్లా కో కన్వీనర్ సుధీర్ రెడ్డి 

జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), జూలై 31: వీబీజీ రాంజీ ఉద్యోగులకు వెంటనే వేతన శ్రేణి అమలు చేయాలని వీబీజీ రాంజీ ఉద్యోగుల సంఘం జిల్లా కో కన్వీనర్ బి సుధీర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు పే స్కేల్ మంజూరు చేయాలని కోరుతూ శుక్రవారం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో వీబీజీరాంజీ ఉద్యోగులు పెన్ డౌన్,షట్ డౌన్ ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు,ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణ,ప్రజలకు సేవలు అందించడంలో తాము కీలకపాత్ర పోషిస్తున్నప్పటికీ.. ఇప్పటివరకు తగిన వేతనశ్రేణి లేకపోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇంద్రవెల్లి సభలో మంత్రి సీతక్క ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలని,ఇతర ఉద్యోగులైన డీఆర్డీఏ విభాగాలకు చెల్లించిన విధంగా సమాన వేతనాలను 1వ తేదీనే చెల్లించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వీబీజీ రాంజీ ఉద్యోగులు యాదమ్మ,నాగమణి,దీపిక తదితరులు పాల్గొన్నారు.

వికసిత భారత్ (వీబీ జీ రామ్‌జీ ) ఉద్యోగులకు వెంటనే పేస్కేల్ అమలు చేయాలి ః జేఏసీ డిమాండ్

సూర్యాపేట రూరల్, జూలై 31: తమకు వెంటనే వేతన శ్రేణి (పేస్కేల్) అమలు చేయాలని విబిజి రాంజీ (వీబీ జి రామ్ జి ) జేఏసీ సూర్యాపేట జిల్లా ట్రెజరర్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పేస్కేల్ మంజూరు చేయాలనే ప్రధాన డిమాండ్తో విబిజి రాంజీ ఉద్యోగులు శుక్రవారం నుంచి చేపట్టిన పెన్డౌన్, షట్డౌన్ నిరసన కార్యక్రమాన్ని సూర్యాపేటలో ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల నిర్వహణలో సమర్థవంతంగా సేవలు అందిస్తున్నప్పటికీ, సరైన వేతన శ్రేణి లేకపోవడంతో తీవ్ర ఆర్థిక, సామాజిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సేవలను గుర్తించి వెంటనే పేస్కేల్ అమలు చేయాలని, అలాగే గత 20 ఏళ్లుగా పని చేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఎఫ్టీఈ (ఫ్ టీ ఈ )లుగా కన్వర్ట్ చేయాలని కోరారు.

న్యాయమైన తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు శాంతియుతంగా, ప్రజాస్వామ్య బద్ధంగా నిరసనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

వేతన శ్రేణి (పేస్కేల్) కోసం వీబీజీ రాoజీ 

ఉద్యోగుల పెన్‌డౌన్

నేరేడుచర్ల, జూలై 31 : మండలంలోని వీబీజీ రామ్ జి కింద పనిచేస్తున్న ఉద్యోగులకు తగిన వేతన శ్రేణి (పే స్కేల్ ) మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం నుంచి ఉద్యోగులు పెన్డౌన్ , షట్డౌన్ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నామని వీబిజి రాం జీ ఉద్యోగ నాయకులు శుక్రవారం తెలిపారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, వివిధ కార్యక్రమాల అమలులో కీలక పాత్ర పోషిస్తూ, గ్రామీణాభివృద్ధి మరియు ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడంలో నిరంతరం సేవలు అందిస్తున్నప్పటికీ, తమకు తగిన వేతన శ్రేణి లేకపోవడం వల్ల ఉద్యోగులు ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం వెంటనే తమ న్యాయమైన డిమాండ్ను పరిశీలించి, తగిన పే స్కేల్ మంజూరు చేయాలని, ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించే వరకు శాంతియుతంగా తమ నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తామని  స్పష్టం చేశారు.