26-08-2025 12:20:33 AM
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
తలకొండపల్లి,ఆగస్టు 25: రాష్ట్రం లోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ది కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రేస్ ప్రభత్వం కృషి చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అ న్నారు.
కల్వకుర్తి నియోజకవర్గంలోని కడ్తాల్ మండలం మక్తమాదారం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయితీ భవనం ప్రారంభోత్సవం,గోవిందాయిపల్లిలో రూ.20లక్షలతో నిర్మించిన పంచాయితి భవనం ప్రారంభోత్సవం,రూ.12లక్షలతో నిర్మించనున్న అగంవడి భావనానికి శంకుస్తాపన,ఆమనగల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో రూ.50లక్షలతో నిర్మించిన రోడ్డు కల్వర్ట్ ప్రారంభోత్సవం,రూ.24లక్షలతో నిర్మించనున్న రెండు అంగన్వాడి భవనాలకు శంకుస్తాపన చేశారు.
తలకొండపల్లి మండలం చుక్కాపూర్ గ్రామంలో రూ.12లక్షలతో నిర్మించిన నూతన అంగన్వాడి కేంద్ర భవనాన్ని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ చిన్న పిల్లలను అంగన్వాడి కేంద్రాలకు పంపించాలని సూచించారు.
ఈ కేంద్రాలలో పిల్లలకు పోషకాలతో కూడిన పౌష్టికాహారం అందింస్తారని,అదేవిదంగా పిల్లలకు అభ్యాసన విదానం అలవడు తుందని చెప్పారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమం,అభివృద్ది పనుల కోసం ఎక్కువ మొత్తంలో నిదులు కేటాయిస్తున్నారని తెలిపారు.కాంగ్రేస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను పార్టీల కతీతంగా అర్హులైన వారందరికి అందిస్తున్నట్లు ఎమ్మెల్యే నారాయణరెడ్డి వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ దాసరి కిష్టమ్మ,ఆమనగల్ మార్కెట్ కమిటి చైర్మన్ యాట గీతానర్శింహా,వైస్ ఛైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి,మాజీ ఎంపిపి లక్ష్మిదేవిరఘురాములు,మాజీ ఎంపిటిసిలు గూడూరు శ్రీనివాసురెడ్డి,దాసరి యాదయ్య,మాజీ ఉప సర్పంచ్ జక్కు శ్రీనివాసురెడ్డి,కాంగ్రేస్ మండల పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి,బిచ్యనాయక్,నాయకులు రంగా రెడ్డి,యాట నరసింహా,కాలురి నర్సింహా,రఘు తదితరులుపాల్గొన్నారు.